ఓటింగ్ శాతం పెరగాలి..ప్రశ్నించే గొంతుకలు ఉండాలని పేర్కొన్నారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. సిద్దిపేటలోని భరత్ నగర్ అంబిటాస్ స్కూల్ లో కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు.
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ… గతంలో కంటే ఎక్కువ శాతం పట్టణాలలో పోలింగ్ పెరుగుతుందని…ప్రశ్నించే గొంతుక ఉండాలని ప్రజలు ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. మేధావులు,విద్యావంతులు పోలింగ్ లో పాల్గొనాలని కోరారు. ప్రజాస్వామ్యం బలపడలంటే అందురు ఓటింగ్ లో పాల్గొనాలన్నారు. గత పార్లమెంటు ఎన్నికలలో కంటే పోలింగ్ శాతం పెరుగుతుందని పేర్కొన్నారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు.