కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్రంగా ఫైర్ అయ్యారు. విద్యార్థుల విషయంలో అనుచితంగా ప్రవర్తించిన కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్‌ను వెంటనే విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. కేయూ వీసీని తప్పించాలంటూని విద్యార్థులు చేస్తున్న ధర్నాకు ఈటల రాజేందర్ మద్దతు తెలిపారు. కేయూ వైస్ ఛాన్సలర్ వెంటనే విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
వీసీతీరును నిరసిస్తూ రేపు విద్యార్థులు తలపెట్టిన బంద్‌కు పూర్తిస్థాయిలో మద్దతు తెలుపుతున్నట్లు ఈటల రాజేందర్ చెప్పారు. ఆ ఉద్యమాన్ని మరింత విస్తృతం చేయాలని సూచించారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలకమైన విశ్వవిద్యాయాలయాలను కేసీఆర్ సర్కారు అణచివేస్తోందని ఈటల రాజేందర్ ఆందోళన వ్యక్తం చేశారు.
మరోవైపు కేయూ విద్యార్థులను పోలీసులు కొట్టిన తీరు బాధాకరమని ఇటీవలే.. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. టాస్క్‌ఫోర్స్ సిబ్బంది తీసుకెళ్లి కొట్టడం దేశచరిత్రలో తెలంగాణలో జరిగిందని తీవ్రంగా ఫైర్ అయ్యారు. వారిని కొట్టిన తీరు చూసి న్యాయమూర్తే ఆశ్చర్యపోయారని పేర్కొన్నారు. విద్యార్థులను ఇంత దారుణంగా కొట్టించిన ఘనత కేసీఆర్ సర్కార్‌దేనని విమర్శించారు. వారి హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.