స్టేట్ బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్..!

-

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. ఈ సేవల వలన చాలా మందికి ప్రయోజనం ఉంటోంది. ఇది ఇలా ఉంటే స్టేట్ బ్యాంక్ కస్టమర్లకు మరో తీపికబురు అందించింది. కొత్త సర్వీసులు ని తీసుకు వచ్చింది. ఇక పూర్తి వివరాలు చూస్తే.. ట్రాన్సిట్ కార్డను లాంఛ్ చేసింది బ్యాంకు. దాదాపు అన్ని రకాల ట్రాన్స్‌పోర్ట్‌లకు ఈ ఒక్క కార్డు ఉంటే చాలు అంది బ్యాంకు. రూపే నెట్‌వర్క్‌ పైన ఎస్‌బీఐ తాజాగా నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్‌ను తెచ్చింది.

ట్రాన్స్‌పోర్ట్ డిజిటల్ పేమెంట్లను ఈ కార్డు తో ఈజీగా పే చెయ్యచ్చు. రోడ్డు నుంచి రైలు మార్గం వరకు ప్రయాణాలకు మనం డిజిటల్ పేమెంట్స్ ని చెయ్యచ్చు. పార్కింగ్ ఛార్జీలను కూడా చెల్లించే ఛాన్స్ వుంది. అంతేకాకుండా రిటైల్ ఔట్‌లెట్స్‌లో కొనుగోళ్లకు కూడా వాడుకోవచ్చు. అన్ని రకాలుకి కూడా ఈ కార్డు అనువుగా ఉంటుంది. వన్‌ నేషన్ వన్ కార్డు అనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఈ కొత్త ట్రాన్సిట్ కార్డును తీసుకువచ్చినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంది.

దేశీయ తొలి ట్రాన్సిట్ కార్డును రూపే నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ టెక్నాలజీ ద్వారా తీసుకు రావడం జరిగింది. గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2023లో భాగంగా దీన్ని తీసుకు వచ్చారు. అలానే 65 బేసిస్ పాయింట్ల వరకు డిస్కౌంట్ అందిస్తోంది. డిసెంబర్ 31 వరకు ఈ తగ్గింపు ఆఫర్ ఉంటుందని బ్యాంక్ అంది. సిబిల్ స్కోర్ 750 నుంచి 800 లేదా ఆపైన ఉంటే 65 బేసిస్ పాయింట్లు లభిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news