అదిరే స్కీమ్.. నెలకు రూ.5 వేలతో.. రూ.42 లక్షలు…!

-

రిటైర్ అయ్యాక ఆర్థిక సమస్యలు ఏమీ లేకుండా ఉండాలంటే స్కీమ్స్ లో డబ్బులు పొదుపు చేయాలి. ఏదొ ఓ స్కీము లో డబ్బులు పెట్టాలంటే PPF పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు పీపీఎఫ్‌ పథకంలో పెట్టుబడి పెడితే మంచిగా లాభం ఉంటుంది. ఇక దీని గురించి పూర్తి వివరాలు చూస్తే.. ఈ స్కీము ద్వారా చక్రవడ్డీ ప్రయోజనం కూడా ఉంది. దీనితో పాటు మీరు ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు ని కూడా పొందవచ్చు. కేవలం రూ.500తో పీపీఎఫ్‌లో పెట్టుబడులు పెట్టవచ్చు. ఏడాదికి రూ. 1.5 లక్షల వరకు పెట్టవచ్చు.

15 సంవత్సరాల మెచ్యూరిటీని ఈ పథకం కలిగి వుంది. మెచ్యూరిటీ తర్వాత కూడా పెట్టుబడిని కొనసాగించాలనుకుంటే పీపీఎఫ్‌ ఖాతాను 5 సంవత్సరాల పాటు పొడిగించవచ్చు. మెచ్యూరిటీ పూర్తి కావడానికి ఒక సంవత్సరం ముందు దరఖాస్తు చేయాలి. పెట్టుబడిదారుడు నెలకు రూ. 5000 పెడితే రూ. 42 లక్షలను పొందవచ్చు. 7.1 శాతం వడ్డీ రేటు ని ఈ స్కీము తో వస్తుంది. నెలకు రూ. 5000 డిపాజిట్ చేస్తే ఏడాదికి రూ. 60,000 మీ ఖాతా లో పడతాయి.

15 సంవత్సరాలలో మొత్తం డిపాజిట్ రూ. 9,00,000 అవుతుంది. వడ్డీ రేటు ప్రకారం వడ్డీ రూ. 7,27,284 అవుతుంది. ఇలా మీరు మీ డిపాజిట్ చేసిన ఫండ్ రూ. 16,27,284. 5 సంవత్సరాలు ఎక్స్టెండ్ చెయ్యచ్చు. లేదంటే 10 సంవత్సరాలు, 25 సంవత్సరాలు అయినా ఎక్స్టెండ్ చెయ్యచ్చు. ఇలా దాదాపు రూ. 42 లక్షలు వస్తాయి. 25 సంవత్సరాల వ్యవధిలో రూ. 26,00,000 కంటే ఎక్కువ వడ్డీ ఆదాయం ఉంటుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news