ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావుకు తృటిలో తప్పిన పెను ప్రమాదం..!

-

ఆంధ్రప్రదేశ్ లోని కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావుకు పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఇవాళ ఆయన ప్రయాణిస్తున్నటువంటి వాహనం కొల్లేరు నీటిలో కూరుకుపోయింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, కూటమి నాయకులు కామినేని శ్రీనివాసరావును కిందకు దింపి సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ ఘటన కైకలూరు మండలం పందిరిపల్లిగూడెం వద్ద చోటు చేసుకుంది. బుడమేరు ప్రవాహం కొల్లేరులో ఉధృతిగా కలుస్తోంది. గుడివాడ, కైకలూరు, కలిదిండి వంటి ప్రాంతాల్లో వరద నీరు భారీగా చేరింది. 

అదేవిధంగా చేపలు, రొయ్యల చెరువులు సైతం నీటితో మునిగిపోయాయి. వీటిని దాదాపు మూడు రోజులుగా ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు పరిశీలిస్తున్నారు. ప్రజలకు ఎప్పటికప్పుడు భరోసా కల్పిస్తున్నారు. ఆర్థికంగా సయం కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు పందిరిపల్లి గూడెంకు వెళ్తున్నారు. రోడ్డుపై ప్రవహిస్తున్న కొల్లేరు వరదలో ఆయన వాహనం చిక్కుకుంది. వాహనం బురదలో కూరుకుపోవడంతో కామినేనిని భద్రతా సిబ్బంది తాళ్ల సాయంతో బయటికి తీసుకెళ్లారు. దీంతో ఆయనకు పెను ప్రమాదమే తప్పినట్టు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news