ఢిల్లీకి మూటలు పంపించేందుకే మూసీ ప్రాజెక్ట్ ను ముందు పెట్టుకున్నారు అని MLA కేటీఆర్ తెలిపారు. నేను డ్రగ్స్ తీసుకోలేదు, ఫోన్లు ట్యాపింగ్ చేయలేదు, అవినీతి అంతకన్నా చేయలేదు. కాబట్టి చిట్టి నాయుడికి ఒకటే చెబుతున్నా.. ఏం పీక్కుంటావో పీక్కో అన్నారు. అయితే ఎంత ధైర్యం ఉంటే నేను ఈ మాట అనగలుగుతాను. నిజాయితీకి ఉన్న ధైర్యమే అది. అయితే ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఫినిష్ చేస్తా అంటాడు. ముందు నువ్వు ఫినిష్ కాకుండా చూసుకో. నీ పదవికి ఎసరు పెట్టటానికి నల్గొండ, ఖమ్మం బాంబులు వేచి చూస్తున్నాయి అని తెలిపారు.
ఇది సొంత నియోజకవర్గం మీద కూడా పట్టు లేని నువ్వు అసలు ఏం సీఎం వి అని ప్రశ్నించిన కేటీఆర్.. కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చాక భూముల ధరలు భారీగా పెరిగాయి. రైతులకు ఆ భూములే ఆసరా అయ్యాయి. అలాంటి భూములను గుంజుకుంటా అంటే వారికి కోపం రాదా. అధికారం పోయిందని నాకు ఎలాంటి ఫ్రస్ట్రేషన్ లేదు. అసలు అధికారం వస్తుందని కలలో కూడా నేను ఊహించలేదు. 10 ఏళ్లు ప్రజలు మాకు అవకాశం ఇవ్వటాన్ని అదృష్టంగా భావించా అని కేటీఆర్ అన్నారు.