ఈడీ ఎదుట హాజరైన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి..

-

గత కొద్ది రోజుల నుంచి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈడీ ఎదుట హాజరయ్యాడు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. మైనింగ్ తవ్వకాల్లో అక్రమాలు పాల్పడ్డారంటూ ఈడీ కేసు నమోదు చేసింది. మహి పాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి ఇళ్లలో  ఈడి సోదాలు జరిగాయి.

రెండు రోజులపాటు మహిపాల్ ఇంట్లో సోదాలు నిర్వహించారు ఈ డి అధికారులు. దాదాపు 300 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వానికి నష్టం వాటిల్లే విధంగా చేశారని ఆరోపించారు. గత వారం రోజుల క్రితం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తో పాటు సోదరుడి ఇంట్లో ఈడి సోదాలు చేపట్టారు. ముఖ్యంగా మైనింగ్ తవ్వకాల్లో ప్రభుత్వానికి టాక్స్ చెల్లించకుండా ఎగ్గొట్టాలని ఆరోపణలు చేసారు.  సంతోష్ సాండ్ అండ్ గ్రానైట్ పేరుతో మహిపాల్ రెడ్డి వ్యాపారం నిర్వహించారు. దాదాపు 39 కోట్ల రూపాయల వరకు టాక్స్ ఎగ్గొట్టారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మైనింగ్ లో వచ్చిన లాభాలన్నీ రియల్ ఎస్టేట్ తో పాటు వినామీ పేర్లతో వ్యాపారాలు చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news