ఈనెల 27లోపు కాంగ్రెస్​లో చేరతా : మైనంపల్లి

-

బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు రాజకీయ ప్రస్థానంపై ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. ఆయన తనకు, తన కుమారుడికి టికెట్ ఇస్తానంటేనే బీఆర్ఎస్‌లో ఉంటానని.. కుమారుడికి టికెట్ ఇవ్వకపోవడంతో అసంతృప్తితో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో మైనంపల్లి ఈ రూమర్స్‌పై స్పందించారు.

బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన మైనంపల్లి తాజాగా కాంగ్రెస్‌ పార్టీకి జై కొట్టారు. కాంగ్రెస్‌లో చేరనున్నట్లు స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ నేతలు తనను కలిసి పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలిపారు. ఈ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. అయితే తాను టికెట్ కోసం బీఆర్ఎస్‌ను వీడలేదని.. పదవి కోసం కాంగ్రెస్‌లోకి వెళ్లడం లేదని అన్నారు.

అయితే దిల్లీకి వెళ్లి ఆ పార్టీ పెద్దల సమక్షంలో ఈ నెల 27వ తేదీలోపు పార్టీలో చేరతానని చెప్పారు. మెదక్‌లో తన కుమారుడికి మంచి ఆదరణ ఉందని అన్నారు. తాను పార్టీలో నుంచి బయటకు రాగానే.. తమ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని వాపోయారు. ఈ క్రమంలో తన కార్యకర్తలను కాపాడుకునేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news