నాకు ఎంపీ లేదా ఎమ్మెల్సీ పదవి ఇస్తాం అన్నారని స్టేషన్ ఘనపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పేర్కొన్నారు. స్టేషన్ ఘనపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ పంచాయతీ మళ్ళీ మొదటికి వచ్చింది. తాజాగా స్టేషన్ ఘనపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. నాకు ఎంపీ లేదా ఎమ్మెల్సీ పదవి ఇస్తాం అన్నారన్నారు స్టేషన్ ఘనపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య.
స్టేషన్ ఘనపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మాట్లాడుతూ రెండు రోజుల క్రితం మంత్రి కేటీఆర్‌ను కలిస్తే నాకు ఎంపీ లేదా ఎమ్మెల్సీ పదవి ఇస్తాం అన్నారు. అప్పటివరకు స్టేట్ కార్పొరేషన్ నామినేటెడ్ పదవి తీసుకోమని చెప్పారని వెల్లడించారు. మంత్రి కేటీఆర్‌ను కలవడానికి వెళ్తే అక్కడ శ్రీహరి ఉన్నారని, అదే సమయంలో ఫొటో తీశారని చెప్పారని వెల్లడించారు. దీంతో తాను, కడియం శ్రీహరి కలిసిపోయినట్లు కథనాలు వచ్చాయని పేర్కొన్నారు తాటికొండ రాజయ్య.