సీఎం మెడలు వంచి హరీష్ రావు రుణ మాఫీ చేయించారు..!

-

అధికారులు కూడా సీఎం అబద్దాలను చూసి సిగ్గుపడుతున్నారు. 30 వేల ఉద్యోగాలపై, సీతారామ సాగర్ పై సీఎంవి మంత్రులవి అబద్దాలే అని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. సీఎం రాష్ట్రంలో బాక్రానంగల్ ప్రాజెక్టు కట్టింది కాంగ్రెస్ అంటున్నారు. ఇక రైతు రుణ మాఫీ పై సీఎంది అతి పెద్ద మోసపూరిత వైఖరి. మొదట రుణ మాఫీకి 40 వేల కోట్లు అవుతుందన్నారు.. తర్వాత 31 వేల కోట్లు అన్నారు.. ఇప్పుడు వేసింది 17 వేల కోట్లు మాత్రమే. ఈ రుణ మాఫీ కూడా సీఎం మెడలు వంచి హరీష్ రావు చేయించారు అని పేర్కొన్నారు.

దేవుడి మీద ఒట్లు లేకపోతే తిట్లు అనేది ఈ సీఎం వైఖరి. హరీష్ రావు ఆరు గ్యారంటీలు ,రుణ మాఫీ ఆగస్టు 15 లోగా చేస్తే రాజీనామా చేస్తానన్నారు. ఆ రాజీనామా లేఖను మీడియా మిత్రులకు ఇచ్చారు. హరీష్ రావు ఒత్తిడితోనే సగం రుణ మాఫీ అయినా చేశారు. ఈ సీఎం రేవంత్ భాషను పశువులు కూడా సహించవు. కానీ సీఎంలా చిల్లర చిచోరా భాష ను మాట్లాడేందుకు మాకు సంస్కారం అడ్డు వస్తోంది. రాహుల్ గాంధీకి ఈ సీఎం మీద నమ్మకం లేకే రుణమాఫీ సంబరాలకు రాలేదు అని పల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news