నిజామాబాద్ BRS కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కీలక కామెంట్స్ చేసారు. రేవంత్ రెడ్డి రాష్ట్రానికి దురదృష్టవశాత్తూ సీఎం అయ్యారు. సీఎం హోదాలో ఉండి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు అని తెలిపారు. ఇక ఈ ఏడాది పాలనలో ఆరు గ్యారెంటీ లో ఒక్క హామీ పూర్తిగా అమలు చేయలేదు. రైతులను నిండా ముంచి మహబూబ్ నగర్ లో రైతు పండగ పెట్టడం సిగ్గుచేటు అని ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఇంకా 50 శాతం కంటే ఎక్కువ మంది రైతులకు రుణాలు మాఫీ కాలే. కేసీఆర్ హయాంలో జరిగిన రుణ మాఫీ లో కనీసం సగం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేకపోయింది అని అన్నారు. అలాగే కేసీఆర్ కు వేయి ఏకర్మ భూమి ఉన్నట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని ఛాలెంజ్ చేసిన ప్రశాంత్ రెడ్డి.. ఆయనకు వెయ్యి ఎకరాల లేకుంటే రేవంత్ రెడ్డి ముక్కు నెలకు రాయాలి అని డిమాండ్ చేసారు.