హైడ్రా పై మాజీ మంత్రి సబితా ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైడ్రా ఒక పబ్లిసిటీ స్టంట్ అని… మీడియా, సోషల్ మీడియాలో హడావుడి చేయడం తప్పా హైడ్రాకు ఏమి పని లేదంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మార్క్ తొలగించడానికి హైడ్రాను ఒక ఆయుధంగా వాడుకుంటున్నారని ఆగ్రహించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నేరవేర్చకుండా గత 8 నెలలుగా కేసీఆర్ పై అన్ని విధాలుగా బురదజల్లే కార్యక్రమాన్ని చేపడుతున్నారని నిప్పులు చెరిగారు.
ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేసినా కేసీఆర్ మార్క్ మాత్రం చేరిపి వేయడంలో విఫలమయ్యారని… కొత్తగా హైడ్రాను రంగంలో దించి సామాన్యులను ఇబ్బందుల పాలు చేస్తున్నారన్నారు. ఔటర్ రింగు రోడ్డు చుట్టూ 30వేల ఎకరాలలో 4 లక్షల నిర్మాణాలు అక్రమ నిర్మాణాలు ఉన్నాయని అందులో 10% శాతం కూల్చివేసినా గొప్ప విషయమేనని తెలిపారు. హైడ్రా ఒక డ్రామా, ఆ డ్రామా గుట్టును త్వరలోనే రట్టు చేస్తాం. అప్పటి వరకు హైడ్రా గురించి నో కామెంట్స్ అన్నారు మాజీ మంత్రి సబితా.