ఎమ్మెల్యే శంకర్ నాయక్ వ్యతిరేక వర్గం రహస్య భేటీ

-

మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదుర్ మండలం మదనతుర్తిలోని ఓ మామిడితోటలో రహస్యంగా భేటి అయ్యింది ఎమ్మెల్యే శంకర్ నాయక్ వ్యతిరేకవర్గం. వీరి భేటీని అడ్డుకోవడానికి ఎత్నించారు ఎమ్మెల్యే వర్గీయులు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను సముదాయించారు. అనంతరం రహస్య భేటి సమీపంలో ఎమ్మెల్యేకు మద్దతుగా నినాదాలతో హోరెత్తించారు ఎమ్మెల్యే వర్గీయులు.

ఈ సమావేశంలో ఎమ్మెల్యే వ్యతిరేకవర్గం.. శంకర్ నాయక్ వచ్చే ఎలక్షన్ లో ఎమ్మెల్యే పోటీ నుంచి గౌరవంగా తప్పుకుంటే మంచిదని హెచ్చరించినట్లుగా సమాచారం. లేకుంటే తమ ఓట్లు నోటాకైనా వేయడానికి సిద్ధమయ్యారట. శంకర్ నాయక్ కాకుండా వేరే అభ్యర్థికి టికెట్ ఇస్తే గెలిపిస్తామని ఖరాకండిగా చెబుతున్నారు. ఇక తనకి వ్యతిరేకంగా ఎటువంటి గ్రూపులు లేవని శంకర్ నాయక్ శనివారం ప్రెస్ మీట్ లో తెలిపిన నేపథ్యంలో మరుసటిరోజే మళ్లీ వ్యతిరేక వర్గాలు సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news