రాష్ట్రంలో దుర్మార్గ పాలన సాగుతోంది – నాగం జనార్దన్ రెడ్డి

-

నాగర్ కర్నూల్: నేడు జిల్లా కేంద్రంలోని దళితవాడలో పర్యటించారు కాంగ్రెస్ నేత నాగం జనార్దన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళిత వాడల్లోని ఇందిరమ్మ ఇళ్లకు వేల రూపాయల కరెంటు బిల్లులు, ప్రాపర్టీ టాక్స్ విధించడం విడ్డూరమని అన్నారు. రాష్ట్రంలో దుర్మార్గ పాలన సాగుతుందని మండిపడ్డారు నాగం. ముఖ్యమంత్రి, మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు.

టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఏ సభలోను మూడు గంటల కరెంటు సరిపోతుందని చెప్పలేదని.. రైతులకు అవసరమైన, నాణ్యమైన విద్యుత్ మాత్రమే ఇవ్వాలని చెప్పారని అన్నారు. వాటిని వక్రీకరిస్తూ బీఆర్ఎస్ నేతలు గగ్గోలు పెడుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలకు చేతనైతే సబ్ స్టేషన్ లో ఉన్న లాంగ్ బుక్కులను పెట్టుకొని బహిరంగ చర్చకు కూర్చుందాం అని సవాల్ విసిరారు. ఆంధ్రా వాళ్ళతో కుమ్మక్కై కృష్ణానది నీటిని అక్రమంగా తోడుకొని పోతున్నా ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news