హైకోర్టు నోటీసులపై వివరణ ఇచ్చారు బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే విజేయుడు. గద్వాల జిల్లా అలంపూర్ ఎమ్మెల్యే విజయుడికి నిన్న తెలంగాణ రాష్ట్ర హై కోర్టు నోటీసులు జారీ చేసింది. విజయుడి ఎన్నికను రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు బీఎస్పీ అభ్యర్ది ప్రసన్నకుమార్.ఫీల్డ్ అసిస్టెంట్ పదవికి రాజీనామా చేయకుండానే నామినేషన్ వేయడంతో పాటు, వృత్తి వివరాలు నామినేషన్ లో పేర్కొనలేదని పిటీషన్ వేశారు బీఎస్పీ అభ్యర్ది ప్రసన్నకుమార్.
ఈ ఎన్నికపై వివరణ ఇవ్వాలని ఎమ్మెల్యే విజయుడికి నోటీసులు జారీ చేసింది తెలంగాణ రాష్ట్ర హై కోర్టు. అయితే.. హైకోర్టు నోటీసులపై వివరణ ఇచ్చారు బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే విజేయుడు. హైకోర్టు నుంచి నాకు ఎలాంటి నోటీసులు అందలేదు.. నోటీసులు అందుకున్న వెంటనే కోర్టుకి అన్ని వివరాలు సమర్పిస్తానన్నారు. ఎన్నికలకు ఆరు నెలల ముందే ఉద్యోగానికి రాజీనామా చేశాను.. నేను చేసింది తాత్కాలిక ఉద్యోగం తప్ప రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగం కాదని స్పష్టం చేశారు అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజేయుడు.