ఆ విషయంలో BRS సభ్యులు కుట్ర చేస్తున్నారు : యెన్నం శ్రీనివాస్ రెడ్డి

-

పీఏసీ ఔనత్యం తగ్గించే కుట్ర బిఆర్ఎస్ సభ్యులు చేస్తున్నారు. గత పదేండ్లలో జరిగిన ఆర్ధిక విధ్వంసం బయటికి రాకుండా చేస్తున్నారు అని అన్నారు మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి. రూల్స్ ప్రకారమే పీఏసీ నియామకం జరిగింది. సీనియర్ సభ్యులు గాంధీని పీఏసీ చైర్మన్ గా చేశారు. గతంలో ప్రగతి భవన్లో నిర్ణయం జరిగేది. ఎంఐఎం కు గతంలో ఎట్లా ఇచ్చారు అందరికి తెలుసు. రూల్ ప్రకారమే చైర్మన్ నియామకం జరిగింది. మీటింగ్ లో స్పీకర్ పై ఇష్టం వచ్చిన పదజాలం తో దాడికి దిగారు. గత పదేండ్లలో జరిగిన ఖర్చుల విధ్వంసం పీఏసీ తేల్చుతది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ నిజాయితీగా పనిచేస్తది.

పదేండ్లలో పీఏసీ కమిటీని తుంగలో తొక్కింది. మళ్ళీ అవే కుట్రలు జరుగుతున్నాయి. గతంలో పీఏసీ చైర్మన్ లుగా వున్న వారు కూడా ఇప్పుడు సభ్యులుగా వున్నారు. ప్రజాధనం దుర్వినియోగం బయటికి తీస్తాం. పీఏసీ ప్రజల పక్షం. రాబోయే రోజుల్లో వచ్చే రిపోర్ట్ వారి రాజకీయ భవిష్యత్ ప్రమాదంలో పడ్తుందని భయపడుతున్నారు. అసెంబ్లీ బిజినేస్ 250 రూల్ ప్రకారమే సభ్యుల ఎన్నిక జరిగింది అని యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version