జీవితంలో పైకి రావాలంటే డబ్బులు చాలా అవసరం. మనం ఎంత ఎత్తు ఎదగాలన్నా డబ్బులు చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి. అయితే కొంతమంది సంపాదించేది కొంచెం ఖర్చు పెట్టేది బోలెడు. అలా అయినప్పుడు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలా సమస్యని మీరు ఫేస్ చేస్తున్నట్లయితే ఇప్పుడే వీటిని చూడండి.
అవసరాల కోసం డబ్బు ఖర్చు చేయడం చాలా సహజం. కానీ మనకు తెలియకుండా చాలా అనవసరమైన ఖర్చులు చేస్తూ ఉంటాము. ఓసారి నెలవారీ ఖర్చులు అన్నిటిని పరిశీలించి చూస్తే మీకే తెలుస్తుంది.
నెలవారి బడ్జెట్ రూపొందించుకోవడం వలన కచ్చితంగా అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవచ్చు. అవసరాలు సరదాల కోసం కొంత మొత్తాన్ని కేటాయించండి. ఆదాయంలో కొంత మొత్తాన్ని పొదుపు చేయండి.
చాలామంది బయట ఆహార పదార్థాలను తింటూ ఉంటారు. అలా చేయడం వలన ఎక్కువ డబ్బు వేస్ట్ అయిపోతుంది. అలా కాకుండా ఇంట్లోనే వంట చేసుకుంటే చాలా డబ్బుల్ని ఆదా చేసుకోవచ్చు.
కిరాణా దుకాణానికి వెళ్లి కావాల్సిన సామాన్లు అన్నిటిని ఒకేసారి తెచ్చుకోండి. దీంతో ఖర్చు తగ్గుతుంది.
కరెంటు బిల్లును తగ్గించుకోవడానికి చూసుకోండి. అలాగే ఎలక్ట్రానిక్స్ వినియోగాన్ని తగ్గించండి. గ్యాస్ ని కూడా ఆదా చేసుకోండి.
షాపింగ్ చేసేటప్పుడు స్మార్ట్ గా షాపింగ్ చేయడం అలవాటు చేసుకోండి. డిస్కౌంట్లు, కూపన్స్, ఆఫర్లు ఉన్నప్పుడు కొనుగోలు చేయండి.
ఏదైనా వస్తువు కొనాలనుకుంటే వెంటనే కొనకుండా ఒకటి రెండు రోజులు చూసి కొనండి మీ ఆర్థిక లక్ష్యాలను కచ్చితంగా నిర్దేశించుకోవాలి.
ఖచ్చితంగా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి.
ఉచితంగా దొరికే వాటిని వినియోగించుకోండి. థియేటర్లకి షాపింగ్ మాల్స్ కి వెళ్తే ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కానీ గ్రంధాలయాలకి ఆట స్థలాలకి వెళితే డబ్బులు ఖర్చు చేయక్కర్లేదు. ఫ్రీగా మీరు అక్కడ సమయాన్ని గడిపి రావచ్చు. ఫ్రీగా జరిగే ఈవెంట్స్ కి కూడా వెళ్లడానికి అవుతుంది. దీంతో మానసిక ఆనందం ఉంటుంది అనవసరమైన ఖర్చులు కూడా తగ్గుతాయి.