హరీష్ రావు కి బీఆర్ఎస్ లో ఎక్కువ రోజులు నిలబడాలని లేనట్లుంది అని మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆయన ఏ చర్చ పెట్టిన బీఆర్ఎస్ కు నష్టం జరిగే విధంగా ప్లాన్ చేస్తుండు. ఆయనకు కావాల్సింది కేటిఆర్ బ్రష్టు పట్టాలని. ఆయన పూర్తిగా ఆగం అయితే నేను పగ్గాలు చేపట్టొచ్చు అనుకుంటుండు. KCR అసెంబ్లీకి రాడని నిర్దారణ అయింది. ఒక కుటుంబం చేసిన తప్పులను సవరించడానికి మేము ఉన్నాం అన్నడు.
కేసిఆర్ రాజకీయ సన్యాసం తీసుకోబోతున్నదని.. కేటీఆర్ కి చట్ట సభలు మీద అవగాహన లేదని.. హరీష్ రావు కి BRS ప్రజల్లో ఉండాలని లేదని అర్థం అవుతుంది. అప్పుల మీద చర్చ పెడితే చివరకు ఏం అయ్యింది. సభలో హరీష్ రావు పెట్టే చర్చ BRS కు నష్టం చేసేదిగా ఉంది.. అది ఎవరికి అర్థం కావడం లేదు. పదేళ్లు BRS మిత్రుడిగా ఉన్న వ్యక్తి అసద్ ఉద్దీన్ ఒవైసీ ఇటువంటి కచర పార్టీ ఉండటం వల్లే రాష్ట్రం ఇలా ఉందని అన్నారు. హరీష్ రావుకు కేటీఆర్ భూ స్థాపితం కావాలి. పార్టీ నిరుగరిపోవాలి తర్వాత నేను చూసుకుంటా అనుకుంటున్నాడు అని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.