బాల్కసుమన్ కి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కౌంటర్..!

-

మహనీయుల సరసన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టడం ఏమిటనీ సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్, కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు చేస్తోంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ బాల్క సుమన్ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా విమర్శించారు. మహనీయుల సరసన రేవంత్ రెడ్డి ఫోటో పెట్టడం వారిని అవమానించడమేనని సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను ట్వీట్ చేశారు. సాక్షాత్తు శాసనమండలి ఛాంబర్లో జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, ప్రముఖ సామాజిక వేత్త, మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటాల సరసన రేవంత్ రెడ్డి ఫోటోను పెట్టడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని ట్వీట్లో పేర్కొన్నారు.

దీనిపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా స్పందిచాయి. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ వెంకట్ బల్మూరి కౌంటర్ ట్వీట్తో కేసీఆర్ ఉన్న ఫోటో పంచుకున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆయన ఫోటో అక్కడే ఉందన్నారు. అప్పుడు కళ్ళు మూసుకు పోయాయా? ప్రతి దానికి అనవసరపు రాద్ధాంతం అని ప్రశ్నించారు. జనాలు ఎమ్మెల్సే, ఎంపీ ఎన్నికల్లో బుద్ధి చెప్పిన ఇంకా పద్దతి మారక పోతే ఎవరూ ఏం చేయగలరని, మిమ్ముల్ని మీరే బొంద పెట్టుకుంటా అంటే ఎవరు వద్దంటారని విమర్శించారు. తెలంగాణకు ఇన్నాళ్లు పట్టిన భ్రష్టు వదులుతుంది అంటే తెలంగాణా ప్రజానీకానికి అంతకు మించి ఏం కావాలని గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్న ఫోటోను ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news