అక్రమ నిర్మాణాలతో జలాశయాల్లో నీరు నిల్వ ఉండలేక, వరదల సమయం లో ఇబ్బంది ఎదుర్కొంటున్నాం.సీఎం రేవంత్ జంట నాగరాల్లో అక్రమణలా తొలగింపునాకు హైడ్రా ఏర్పాటు చేయడం చైర్మన్ గా సీఎం ఉండడం అభినందనీయం అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. బఫర్ జోన్ రక్షణ దిశగా చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది. పర్యావరణ ప్రేమికులు ఈ విధానం పై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చర్యలతో ప్రజల నుండి మంచి స్పందన వస్తుంది. జలాశయాల నిబంధనల పరిరక్షణకు అనుగుణంగా రాష్ట్రంతో పాటు పట్టణాలకు అనుబంధంగా ఉన్న వాటిలో కూడా ఆక్రమణలు పెరిగాయి.
కాబట్టి జిల్లా, పట్టణ పరిధిలో కూడా హైడ్రా లాంటి విధానం అమలు చేయాలి. హైడ్రా పరిధి పెంచకపోతే జిల్లా కలెక్టర్ లకు అధికారం ఇవ్వాలి. ఆక్రమణ నిర్మాణాలు జరగకుండా హద్దులు నిర్ణయించాలని ప్రభుత్వం కు విజ్ఞప్తి చేస్తున్న అన్నారు. అలాగే పర్యావరణ ప్రేమికులకు ఇదో శుభవార్త హైడ్రా పరిధి రాష్ట్రం మొత్తం విస్తరణ కు ప్రభుత్వం చొరవచుపాలి అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు.