నన్ను సంపుకుంటారా.. సాదుకుంటారా – జీవన్ రెడ్డి లేఖ

-

నన్ను సంపుకుంటారా.. సాదుకుంటారా అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి లేఖ రాశారు. మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీకి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి లేఖ రాశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ప్రత్యేక గుర్తింపు ఇస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై హైకమాండ్ కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి…. సంచలన లేఖ రాశారు.

తీవ్ర ఆందోళన మానసిక వ్యధ బాధాతప్త హృదయంతో లేఖ రాస్తున్నట్టు పేర్కొన్న జీవన్ రెడ్డి…తన రాజకీయ భవిష్యత్ పై మీరే నిర్దేశించండి అని అడిగారు.  కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల ఫిరాయింపులో కీలకంగా పనిచేసిన పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కూడా పార్టీలో చేర్చుకున్నారని మండిపడ్డారు. పదేళ్లు బీఆర్ఎస్‌ పై పోరాడానని గుర్తు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే.. నా అనుచరుడిని కిరాతకంగా చంపేశాడని ఆరోపణలు చేశారు. కాంగ్రెస్‌లో ప్రస్తుత పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నా.. మానసిక ఆవేదనలో ఉన్నా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news