మా హయాంలో గ్రామ స్వరాజ్యం తీసుకువచ్చాం. ఇప్పుడు రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి అని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గ్రామ సచివాలయాల ద్వారా ఉత్తమమైన సేవలు అందించేవారిమి. ఇక ఇప్పుడు ప్రతిపక్షంలో మేము వస్తే భద్రత కూడా కల్పించడం లేదు. డయేరియాతో గుర్లలో పద్నాలుగు మంది చనిపోయారు. అక్టోబర్ 19 న ట్వీట్ చేస్తే తప్పా ప్రభుత్వం స్పందించలేదు. 35 రోజుల క్రితం తొలి కేసు నమోదు అయినా పట్టించుకోలేదు.
ప్రస్తుతం కొన్ని గ్రామాల్లో డయేరియా ఉదృతంగా ఉంది. ఒక వ్యక్తి చనిపోయాడు అని కలెక్టర్ అంటున్నాడు. కానీ డయేరియా వల్ల ఎవరు చనిపోలేదు అని చెప్పే ప్రయత్నం చేశారు. నేను ప్రశ్నించిన తరువాత సీఎం ఎనిమిది అని, డిప్యూటి సీఎం 10 మంది అని ఒప్పుకున్నారు. చంపావతి నదిలో నీరు దారుణంగా ఉంది . సిపిడబ్ల్యూ స్కీమ్ రెన్యువల్ కూడా చేయలేదు. ఫిల్టర్లు మార్చడం కానీ, క్లోరినేషన్ కానీ జరగలేదు. అలాగే వాటర్ ట్యాంక్స్ మెయింటైన్స్ కూడా చేయలేదు అని మాజీ సీఎం పేర్కొన్నారు.