ప్రతిపక్షాలు విమర్శలు మాని సలహాలు, సూచనలు ఇవ్వాలి : జీవన్ రెడ్డి

-

ప్రకృతి వైపరిత్యాలతో రాష్ట్రం వరదలతో అతలాకుతలం అయింది. గత రెండు రోజుల నుండి ప్రభుత్వ యంత్రాంగం, సీఎం క్షేత్ర స్థాయిలో పర్యవేక్షిస్తూ నష్ట పరిహారం, ఆర్థిక సహాయం అందించేందుకు చర్యలు చేపడుతున్నారు అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. పంట నష్టం ఎకరాకు 10 వైలు, ఆస్తి నష్టం తో పాటు పంట ప్రాణ నష్టం కు ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా ప్రభుత్వం ప్రకటించింది. దశాబ్దా కాలంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల కోట్ల రూపాయలు నష్ట వచ్చిన అప్పటి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.

అయితే ప్రభుత్వం చేస్తున్న సహాయం చూసి జీర్ణించుకోలేక ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. కానీ ఈ సమయంలో ప్రతిపక్షాలు విమర్శలు మాని సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. విదేశాల్లో ఉండి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా విమర్శలు చేస్తూ… విదేశీ పర్యటన ట్విట్ల కే పరుమితం అయ్యారు. చెరువులు, నాలాలు పరిరక్షిస్తేనే వరద ఉధృతిని తట్టుకోగలం. హైడ్రా తరహా విధానం జిల్లాలకు కూడా విస్తరించి చెరువుల జాగలను రక్షిస్తానని చెప్పడాన్ని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడాన్ని హర్షిస్తున్న. రాష్ట్రం లో వరదలతో 10 లక్ష ల ఎకరాల వరకు పంట నష్టపోయాం, 20 మంది పైన మృతి చెందారు, ఇల్లు కూలిపోయిన వారికి ఇందిరమ్మ పథకంలో ఇల్లు ఇస్తాం. వరద నష్టపరిహారానికి 10 వేలకోట్ల వరకు ఖర్చవుతుంది. కేంద్రం జాతీయ విపత్తుగా గుర్తించి సహాయ చర్యలు చేపట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఐదు వేల కోట్ల రూపాయలు గ్రాంట్ కల్పించాలి అని కోరారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news