“దేవర” నుంచి మరో ప్రోమోసాంగ్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న మాస్ బీట్

-

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా, బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వి కపూర్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న తాజా పాన్ ఇండియా చిత్రం దేవర. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మించిన ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంతోకాలంగా వెయిట్ చేస్తున్నారు.

పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను ఈ నెల 27వ తేదీన విడుదల చేయనున్నారు మేకర్స్. టాలీవుడ్ వైపు నుంచి ఈ మధ్యకాలంలో వస్తున్న పెద్ద సినిమా ఇదే. ఇక ఈ సినిమాకి అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నారు. దీంతో ఈ సినిమాలోని పాటలపై కూడా భారీ క్రేజ్ నెలకొంది. ఈ మూవీ నుండి రిలీజ్ చేయనున్న మూడో సాంగ్ ప్రోమో కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మూడో సాంగ్ ప్రోమో ని రిలీజ్ చేసింది మూవీ యూనిట్.

“దావూదీ” అంటూ సాగే ఈ సాంగ్ మాస్ బీట్ తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అనిరుద్ సంగీతానికి జాన్వీ కపూర్, ఎన్టీఆర్ డ్యాన్స్ అదిరిపోయింది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు సోషల్ మీడియాలో స్టెప్పులను షేర్ చేస్తున్నారు. ఈ మూవీ నుండి ఇప్పటికే విడుదలైన ఫియర్, చుట్టమల్లె పాటలకు విపరీతమైన క్రేజ్ వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సాంగ్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news