అధికారంలో ఉన్నా లేకున్నా తెరాస ప్రజలతోనే ఉంటుంది: కవిత

-

అధికారంలో ఉన్నా లేకున్నా టీఆర్ఎస్ ప్రజలతోనే ఉంటుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కొందరు ప్రజలను విడగొట్టి ప్రయోజనం పొందే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ సమాజాన్ని మతం పేరుతో రెచ్చ గొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలో 22లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పిన బీజేపీ వాటిని ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు.

నిజామాబాద్ జిల్లా కమ్మర్​పల్లిలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో కవిత పాల్గొన్నారు. ఆడపడుచులందరికీ బతుకమ్మ చీరలు అందజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి ఇంటి పెద్దన్నలా బతుకమ్మ పండుగకు ఆడపడుచులందరికీ కానుకగా ఈ చీరలు అందజేస్తున్నారని తెలిపారు. కొందరు రాజకీయ లబ్ధి కోసం బతుకమ్మ చీరలు నాణ్యంగా లేవని.. ఆ చీరలను కాల్చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ప్రేమతో ఇచ్చిన కానుకను ఇలా రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం బాధాకరమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news