BREAKING: కల్వకుంట్ల కవితకు ఊరట లభించింది. కల్వకుంట్ల కవితకు బెయిల్ మంజూరు అయింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితకు బెయిలు మంజూరు అయింది. ఈడి కేసులో కల్వకుంట్ల కవితకు బెయుల్ మంజూరు అయింది. ఈ మేరకు సుప్రీం కోర్టు ప్రకటన చేసింది.
ఇక అంతకు ముందు… కవిత బెయిల్ పిటిషన్‌పై దర్యాప్తు సంస్థల తరఫున లాయర్ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. ఫోన్లలో ఉన్న డేటాను కవిత ఫార్మాట్ చేశారని పేర్కొన్నారు. ఆధారాలు, సాక్ష్యాలు కవిత మాయం చేశారని ఆరోపణలు చేశారు. దర్యాప్తునకు సహకరించడంలేదన్నారు. ఫోన్లో డేటా ఎక్కువైనప్పుడు డిలీట్ చేస్తాం.. కానీ, ఫార్మాట్ చేయరని వివరించారు. ఆధారాలను కవిత తారుమారు చేశారన్నారు. ఈ పరిస్థితుల్లో ఆమెకు బెయిల్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు సీబీఐ, ఈడీ లాయర్ ఎస్వీ రాజు.