ఏపీలో 68.12 శాతం పోలింగ్‌ అయితే..82 శాతం ఎలా అయింది – అంబటి

-

ఏపీలో 68.12 శాతం పోలింగ్‌ అయితే..82 శాతం ఎలా అయిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు నిలదీశారు. సచివాలయంలో ఎన్నికల ప్రధానాధికారిని కలిసింది వైసీపీ బృందం. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ… దేశ వ్యాప్తంగా మే 13వ తేదీన ఎన్నికలు జరిగితే జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వచ్చాయన్నారు. కూటమి గెలుపు షాక్ ఇచ్చింది.. మొదట నమ్మలేకపోయామని చెప్పారు. ఓట్ ఫర్ డెమాక్రసీ అనే సంస్థ పోలింగుపై అనుమానాలు వ్యక్తం చేసిందని… భారత ఎన్నికల సంఘం ఈ అనుమానాలు నివృత్తి చేయాలని కోరారు.

The YCP team met the Chief Electoral Officer at the Secretariat

ఏ లోపం లేకుండా ఎన్నికలు జరిగాయని చెప్పాల్సిన బాధ్యత ఈసీకి ఉందని…ఎన్నికలయ్యాక ఏపీలో 68.12 శాతం పోలింగ్ పూర్తి అయిందని ఈసీ చెప్పిందని గుర్తు చేశారు. తర్వాత 76.5 శాతానికి పెరిగింది. ఫైనలుగా 80.66శాతంగా ప్రకటించారన్నారు. కౌంటింగ్ సమయంలో 82 శాతం పోలింగ్ జరిగినట్లుగా ఈసీ చెప్పిందని తెలిపారు. ఎన్నికల సంఘం ఈ అనుమానాలు క్లియర్ చేయాలని కోరారు. ఇవాల్టీ వరకు ఫామ్-20 అంటే ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు.. ఎవరికి పోల్ అయ్యాయని చెప్పలేదన్నారు. ఇదోక అసాధారణమైన చర్య.. ఎందుకు ఆలస్యం అయిందని ప్రశ్నించారు. ఫైనల్ ఫిగరుకి కౌంటింగ్ ఫీగరుకి ఎందుకు తేడా వచ్చింది.. ఇది దురదృష్టం అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news