ఆమె కాలి గోటికి కూడా ఎమ్మెల్సీ కవిత సరిపోదు.. మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు

-

నిన్న జరిగిన ఇంద్రవెళ్లి సభలో రూ.500 కే గ్యాస్ సిలిండర్ స్కీమ్ ని త్వరలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ చేతుల మీదుగా ప్రారంభిస్తామని సీఎం రేవంత్ రెడ్డి  ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశంలో ప్రియాంక గాంధీతో ఆ స్కీమ్ ప్రారంభిస్తామంటే మేము అడ్డుకుంటామని ప్రకటించారు. ప్రియాంక గాంధీకి ఏ అర్హత ఉందని.. ప్రభుత్వ కార్యక్రమానికి ఆమెను చీఫ్ గెస్ట్ గా పిలుస్తారని ప్రశ్నించారు కవిత.

అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటనలకే అధికంగా ఖర్చు చేస్తుందని పేర్కొన్న రేవంత్ రెడ్డి.. ఇంద్రవెళ్లి సభలో ఎంత ఖర్చు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. తాజాగా కవిత వ్యాఖ్యలపై మంత్రి సీతక్క స్పందించారు. ఇంద్రవెళ్లి సభకు జనం భారీగా తరలిరావడం చూసి బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారు. బీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్టు ఇంద్రవెళ్లి సభను ప్రభుత్వ నిధులతో నిర్వహించలేదని క్లారిటీ మంత్రి సీతక్క. కాంగ్రెస్ పార్టీ నిధులతో సభను నిర్వహించామని తెలిపారు.ప్రియాంక గాంధీ గురించి మాట్లాడే అర్హత కవితకు లేదన్నారు. ప్రియాంక గాంధీ కాలి గోటికి కూడా కవిత సరిపోదని సంచలన వ్యాఖ్యలు చేశారు సీతక్క.

Read more RELATED
Recommended to you

Latest news