కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలకు మళ్లీ హైదరాబాద్ వేదికగా మారింది. నగరంలో నేటి నుంచి రెండు రోజులపాటు కాంగ్రెస్ పార్టీ అత్యున్నత విధాన నిర్ణయ కమిటీ సమావేశాలు జరగనున్నాయి. సీడబ్ల్యూసీ భేటీకి హాజరయ్యేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా గాంధీ, మల్లిఖార్జున ఖర్గే నగరానికి ఈరోజు తరలిరానున్నారు.
నేటి నుంచి హైదరాబాద్ వేదికగా CWC సమావేశాలు నిర్వహించనున్న తరుణంలో… ఇప్పటికే కాంగ్రెస్ జాతీయ నేతలు హైదరాబాద్ చేరుకున్నారు. వీరికి 100కు పైగా వంటకాలను రుచి చూపించేందుకు టీపీసీసీ సిద్ధమవుతోంది. తెలంగాణ వంటకాలతో పాటు హైదరాబాద్ బిర్యానీ, మటన్, చికెన్, చేపలు, లివర్ ఫ్రై, చింతచిగురు మటన్, కూరగాయలు, ఇడ్లీ, వడ, దోస, హలీమ్, ఇతర వెరైటీలు రెడీ చేస్తున్నట్లు ఆ పార్టీ నేత షబ్బీర్ అలీ తెలిపారు. ఇక అటు శుక్రవారం దిల్లీ నుంచి వచ్చిన కాంగ్రెస్ జాతీయ నేతలు జైరాం రమేశ్, కేసీ వేణుగోపాల్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా తుక్కుగూడకు వెళ్లి విజయభేరి సభా వేదికను పరిశీలించారు.