నార్లాపూర్ పంప్ హౌస్‌లో మొదటి పంపు డ్రైరన్ విజయవంతం

-

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లో భాగంగా నార్లాపూర్ పంప్ హౌస్ లో మొదటి పంపు డ్రైరన్ విజయవంతమైంది. నీటిపారుదల శాఖ అధికారులు ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా వెట్ రన్ నిర్వహించనున్నారు. అందుకు సంబంధించి అన్ని సన్నాహకాలు పూర్తి చేసిన అధికారులు, వెట్ రన్ ట్రయల్ ను సైతం విజయవంతంగా పూర్తి చేశారు. ఉదయం 4గంటల 48 నిమిషాలకు ఈ ట్రయల్ రన్ చేపట్టినట్టుగా తెలుస్తుంది.

శ్రీశైలం జలాశయం వెనుక జలాల నుంచి అప్రోచ్ కెనాల్ ద్వారా హెడ్ రెగ్యులేటరీ, ఇంటెక్ వెల్, సొరంగ మార్గాల ద్వారా సజ్జపూల్‌లోకి చేరిన కృష్ణా జలాలు….. మొదటి పంపు నుంచి డెలివరీ మెయిన్స్ ను దాటుకొని నార్లాపూర్‌ జలాశయానికి విజయవంతంగా చేరాయి.  ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ సన్నాహక పరీక్ష పూర్తి కావడంతో ఇంజనీరింగ్ అధికారులు ఆనందం వ్యక్తం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డి, నాగర్ కర్నూల్ నీటిపారుదల శాఖ C. E హమీద్ ఖాన్ పర్యవేక్షణలో  ఇంజనీరింగ్ అధికారులు ఈ సన్నాహక పరీక్షను విజయవంతంగా పూర్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news