కేసీఆర్ మీద కోపంతో తెలంగాణ తల్లి రూపాన్నే మార్చారు : కేటీఆర్

-

కేసీఆర్ కోపంతో తెలంగాణ తల్లి రూపాన్నే మార్చే ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పేర్కొన్నారు. తాజాగా తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. గత పదేళ్లలో కేసీఆర్ నిర్మించిన గొప్ప నిర్మాణాల గురించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం లేదు. కొత్త ప్రాజెక్టులకు ప్రముఖుల పేర్లు పెట్టాం.  కవులు, కళాకారులకు ప్రాధాన్యం ఇచ్చామని గుర్తు చేశారు. గతంలో హైదరాబాద్ లో జరిగిన నిర్మాణాల గురించి గొప్పగా చెబుతున్నారు.

తెలంగాణలో బాబా సాహెబ్ అంబేద్కర్ సచివాలయం సీఎం రేవంత్ రెడ్డికి కనిపించడం లేదన్నారు. ఇందిరాగాంధీ హయాంలో ఏర్పాటు చేసిన భరతమాత రూపాన్ని ఎవ్వరూ మార్చలేదని గుర్తు చేసారు. బతుకమ్మ, బోనాలు పండుగలను రాష్ట్ర పండుగగా జరుపుకున్నామని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో దేశంలో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని గుర్తు చేశారు. ఇప్పటికైనా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చే ప్రయత్నం చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు కేటీఆర్. 

Read more RELATED
Recommended to you

Latest news