ఇబ్రహీంపట్నంలో దారుణం చోరు చేసుకుంది. ఇద్దరు పిల్లలతో సహా చెరువులోకి దూకి తల్లి ఆత్మహత్య చేసుకోగా.. మరో కుమారుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనలో తల్లి, కుమారుడు, కూతురు మృతి చెందారు. నిన్న తల్లి, కూతురు మృతదేహం లభ్యం కాగా ఈరోజు ఉదయం కొడుకు బాడీ లభ్యం అయ్యింది. మృతురాలు ఒర్సు మంగ (35), కుమార్తె లావణ్య (12), కుమారుడు శరత్ (8) మృతి చెందగా.. ప్రాణాలతో బయటపడ్డాడు విఘ్నేష్ (7).
అయితే ముందు ఇద్దరు పిల్లలను చెరువులో విసిరేసి.. ఆ తర్వాత చెరువులో దూకింది మంగ. నా తర్వాత నువ్వూ చెరువులో దూకమని విఘ్నేష్ కి చెప్పింది తల్లి మంగ. కానీ దూకకుండా చెరువు ఒడ్డునే ఉండిపోయాడు విఘ్నేష్. అయితే చెరువు లో స్నానం చేద్దామని తల్లి ఇక్కడికి తీసుకువచ్చిందని చెప్తున్నాడు విఘ్నేష్. వనస్థలిపురంలోని ప్రశాంతి విద్యానికేతన్ లో మంగ పిల్లలు చదువుతున్నారు. ఇక ఈ సమాచారం మంగ భర్తకు అందించి.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం ఆస్పత్రికి తరలించారు పోలీసులు.