మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత మోత్కుపల్లి నర్సింహులు హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నిరసనకు దిగారు. టిడిపి అధినేత చంద్రబాబు అరెస్ట్ కు వ్యతిరేకంగా దీక్ష చేపట్టారు. కక్షపూరితంగా చంద్రబాబును అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘జగన్ ఎల్లకాలం సీఎంగా ఉండరు. ఏ ఆధారంతో చంద్రబాబును అరెస్టు చేశారు. చంద్రబాబుకు సీఎం జగన్ క్షమాపణలు చెప్పాలి’ అని మోత్కుపల్లి వాక్యానించారు.
ఇక అటు చంద్రబాబు అరెస్టుపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క తొలిసారి స్పందించారు. చంద్రబాబును అలా అరెస్టు చేయడం చాలా తప్పు అని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు ఎమ్మెల్యే సీతక్క. అంత పెద్ద వయసులో ఉన్న వ్యక్తిని జైల్లో పెట్టడం సరైనది కాదని వెల్లడించారు. ఆయన 40 సంవత్సరాల నుంచి రాజకీయ జీవితంలో ఉన్నారని… ఆయన ఈ స్కామ్ చేయలేదని తెలిపారు. లక్షల కోట్లలో బడ్జెట్ ప్రవేశ పెట్టారు.. ఎన్నో పరిశ్రమలు తీసుకువచ్చారు… ఈ కేసులో రాజకీయ కోణాలే ఉన్నాయి అని అందరికీ అర్థమవుతుందని ఎమ్మెల్యే సీతక్క ఫైరయ్యారు.