రేపటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక దినోత్సవాలు జరుగనున్నాయి. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 25 నుంచి 27 వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో పర్యాటక వేడుకలను నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రి వి. శ్రీనివాస గౌడ్ తెలిపారు.
తెలంగాణలోని పలు పర్యాటక కేంద్రాల పట్ల సందర్శకులకు విస్తృతస్థాయి అవగాహన కల్పించేందుకు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. శనివారం మంత్రి వి. శ్రీనివాస గౌడ్ విలేకరులతో మాట్లాడుతూ, పర్యాటక రంగంలోని 37 విభాగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న ప్రముఖులకు ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా 27న మాదాపూర్ శిల్పారామంలో ఏర్పాటు చేసే కార్యక్రమంలో అవార్డుల ప్రధానం చేయనున్నట్టు వివరించారు మంత్రి వి. శ్రీనివాస గౌడ్. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారని.. ఇంకా ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని ఆదేశించారు మంత్రి వి. శ్రీనివాస గౌడ్.