కాంగ్రెస్, బీఆర్ఎస్ పెళ్లి పోస్టర్.. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ బీజేపీపై సెటైర్లు..!

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య పెళ్లి అంటూ బీజేపీ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. దీంతో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీనీ పెళ్లి పెద్దగా.. ఖాజీగా అభివర్ణించింది. ఈ పోస్టర్ పై తాజాగా ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. బీజేపీపై సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. ” నేను అందరికీ పెళ్లి కొడుకునా.. లేక సోదరుడినా..? అంటూ ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ పనికిరాదని.. అందుకే నా ఫోటో పెట్టారని ఓవైసీ అన్నారు. ఈ వయస్సులో పెళ్లి కార్డులో నా ఫొటోల ఉంది. పెళ్లి కానీ వ్యక్తి ఫొటో పెట్టాల్సి ఉందని బీజేపీకి చురకలు అంటించారు.

తెలంగాణలో ప్రధాని మోడీ ప్రభావం చూపకపోవడంతో బీజేపీ తన ఫోటుల వాడుకుంటుందని ఎద్దేవా చేశారు. ఒక కార్టూన్ లో నేను కాంగ్రెస్, బీఆర్ఎస్ వివాహాన్ని నిర్వహిస్తున్నట్టు ఖాజీగా చూపించారు. తెలంగాణలో ప్రధాని మోడీ పోటో తమకు పనికి రాదని ఇప్పుడు అర్థమైంది. అసదుద్దీన్ ఫోటో పెడితే వారికి లాభమని ఆలోచిస్తున్నారు. మీ మోడీ ఫోటో ఎలాంటి ప్రభావం చూపడం లేదు. కాబట్టి ఇలానే కానివ్వండి” అంటూ ఓ బహిరంగ సభలో బీజేపీపై కామెంట్స్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news