త్వరలోనే ఎస్సీ వర్గీకరణకు ఒక కమిటీ వేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక హామీ ఇచ్చారు. శనివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన మాదిగల విశ్వరూప మహాసభకు మోడీ పాల్లొన్నారు. ఈ సందర్భంగా విశ్వరూప సభా వేదికగా ప్రధాని మాదిగలకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఎస్సీ వర్గకరీణకు త్వరలోనే ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని మోడీ స్పష్టం చేశారు.
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరుగుతోన్న మాదిగల విశ్వరూప మహాసభ వేదికగా సాక్షిగా మోడీ ఈ హామీ ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణ కోసం చేస్తున్న పోరాటానికి మా మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగా 30 ఏళ్లుగా వన్ లైఫ్ వన్ మిషన్‌లా పోరాటం చేస్తున్నారని కొనియాడారు. ఈ పోరాటంలో మందకృష్ణ మాదిగ నా నాయకుడు.. నేను ఆయన అసిస్టెంట్‌ను అని మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం. మాదిగలకు న్యాయం చేస్తాం. ఎస్సీ వర్గీకరణ కోసం త్వరలోనే కమిటీ వేస్తాం. ఎస్సీ వర్గీకరణం కోసం జరుగుతున్న పోరాటానికి మా మద్దతు ఉంటుంది. మీ మాదిగ సామాజిక సామాజిక వర్గానికి న్యాయం జరగాలన్నదే మా ఆకాంక్ష అని మోడీ అన్నారు.