సీఎం రేవంత్ రెడ్డికి థాంక్స్ చెప్పిన ఎంపీ బండి సంజయ్..!

-

కేంద్ర రహదారుల మౌలిక సదుపాయాల  నిధి కింద తెలంగాణలో రోడ్ల నిర్మాణానికి రూ.850 కోట్లను కేంద్రం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు సంబంధించి మొత్తం 31 రోడ్ల నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ కార్యదర్శి కమల్ ప్రకాశ్ ఉత్తర్వులు జారీ చేశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రతిపాదనల మేరకు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 4 రహదారుల నిర్మాణానికి రూ.107 కోట్లను విడుదల చేసింది. కరీంనగర్, జగిత్యాల, సిద్దిపేట జిల్లాల పరిధిలో మొత్తం 57 కిలోమీటర్ల పరిధిలో రోడ్ల నిర్మాణానికి నిధుల మంజూరు చేసింది.

వాటిలో గన్నేరువరం నుండి బెజ్జంకి వరకు మొత్తం 23 కి.మీల పరిధిలోని సింగిల్ రోడ్డును డబుల్ లేన్ రోడ్డుగా విస్తరిస్తూ నిర్మాణం చేపట్టనున్నారు. ఇందుకోసం రూ.32 కోట్లను విడుదల చేశారు. అలాగే.. అంతక్కపేట నుండి కొత్తకొండ వరకు మొత్తం 10 కి.మీల మేరకు రోడ్డు నిర్మాణానికి రూ.25 కోట్లు విడుదల చేశారు. మల్యాల నుండి నూకపల్లి, రామన్నపేట గ్రామాల మీదుగా కాచపల్లి వరకు మొత్తం 11.7 కి.మీల రోడ్డు నిర్మాణానికి రూ.25 కోట్లు మంజూరు చేశారు. దీంతోపాటు హుస్నాబాద్ నుండి రామవరం వరకు మొత్తం 11.5 కి.మీల రోడ్డు నిర్మాణానికి రూ.25 కోట్లను విడుదల చేయడం గమనార్హం.

 

Read more RELATED
Recommended to you

Latest news