హనుమకొండ కలెక్టరేట్ లో సామాజిక ఆర్థిక సర్వే,భద్రకాళి మాడవీదుల నిర్మాణం పై నిర్వహించిన సమీక్షలో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు,ఎంపీ కడియం కావ్య,మేయర్ సుధారాణి, కలెక్టర్లు ప్రావీణ్య, సత్య శారద, కమిషనర్ అశ్విని థానాజీ వాకడే పాల్గొన్నారు. సమీక్షా అనంతరం కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. భద్రకాళీ మాడవీధుల నిర్మాణం, ORR, IRR, వరంగల్ నూతన మాస్టర్ ప్లాన్,సమగ్ర సర్వే గురించి రివ్యూ నిర్వహించాం. భద్రకాళి చెరువు నీటిని కిందకు వదిలేసి పూడికతీసి శుభ్రం చేస్తాం. 9వ తేదీ నుండి సర్వే మొదలవుతుంది. అధికారులకు ప్రజలు ఆధార్, రేషన్ కార్డు చూపించాల్సి ఉంటుంది అని పేర్కొన్నారు.
ఇక ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ.. దశాబ్దాల మామునుర్ ఎయిర్పోర్టు కల నెరవేరనుంది. ఎయిర్పోర్టు నిర్మాణానికి జీఎంఆర్ అనుమతి ఇచ్చింది అని తెలిపారు. అలాగే నష్కల్ నుండి హసన్ పర్తి రైల్వే లైన్ నిర్మాణం ఆపాలని రైల్వే అధికారులకు విజ్ఞప్తి చేసాం. 18 తేదీన సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ కు వచ్చి పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తారు అని పేర్కొన్నారు.