ఇద్దరు మాజీ సివిల్ సర్వెంట్లకు ఎంపీ టికెట్.. కేటీఆర్ ఆసక్తికర ట్వీట్..!

-

తెలంగాణలో ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన విషయం తెలిసిందే. మే 13న పార్లమెంట్ ఎన్నికలకు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు సిద్ధం అవుతున్నాయి. బీజేపీ అధిక సీట్లు గెలుచుకుంటుందని ప్రచారం చేస్తుండగా.. మరోవైపు కాంగ్రెస్ 12 నుంచి 14 వరకు ఎంపీ స్థానాలను గెలుచుకుంటుందని నేతలు పేర్కొంటున్నారు. తాజాగా బీఆర్ఎస్ ఇద్దరూ సివిల్ సర్వెంట్లకు ఎంపీ టికెట్ కేటాయించింది.

నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్, మెదక్ నుంచి వెంకట్రామిరెడ్డిలను ప్రకటించారు కేసీఆర్. “ఇద్దరూ ఆల్ ఇండియా మాజీ ఆఫీసర్లు.. బీఆర్ఎస్ టికెట్ పై లోక్ సభ ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. ఈ గొప్ప నిర్ణయానికి కేసీఆర్ గారికి అభినందనలు. నాగర్ కర్నూలు నుంచి పోటీ చేసే ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ గారికి, మెదక్ నుంచి పోటీ చేస్తున్న వెంకట్రామిరెడ్డిలకు బెస్ట్ విషెస్ ప్రకటించారు కేటీఆర్. వీరిద్దరినీ ప్రజలు గెలిపించి పార్లమెంట్ కి పంపుతారనే నమ్మకం ఉంది” అంటూ ట్వీట్ చేశారు కేటీఆర్.

 

Read more RELATED
Recommended to you

Latest news