మూసి క్రస్ట్ గేట్లను తాజాగా అధికారులు ఓపెన్ చేసారు. ప్రస్తుతానికి మూడు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు ప్రాజెక్టు అధికారులు. 2, 7, 8వ నెంబర్ గేట్లను తెరిచారు అధికారులు. అయితే గత కొన్ని రోజులుగా హైదరాబాదులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ వర్షపు నీరు మొత్తం మూసికి చేరుకోవడంతో ప్రాజెక్ట్ నిండుకుండలా మారిపోయింది.
మూసి ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 643.42 అడుగులకు చేరుకుంది. అలాగే మూసి యొక్క పూర్తిస్థాయి నీటి విలువ సామర్థ్యం 4.46 tmc లు అయితే ప్రస్తుతం ఉన్న నీటి నిల్వ 4.05 tmcలుగా ఉంది. అయితే హైదరాబాద్ కు రానున్న మరో మూడు రోజులు కూడా వర్షపు సూచనా ఉన్న విషయం తెలిసిందే. ఒకవేళ హైదరాబాద్ లో వర్షాలు ఇంకా పడితే మూసి ప్రాజెక్ట్ కు వరద ఎక్కువ అవుతుంది. దాంతో ప్రాజెక్ట్ యొక్క మిగిలిన గేట్లు కూడా ఎత్తే అవకాశం ఉంది.