తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. ఎలాగైనా.. తెలంగాణ రాష్ట్రంలో… టీఆర్‌ఎస్ పార్టీ గద్దె దించాలని భారతీయ జనతా పార్టీ ఎత్తులు వేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే.. తెలంగాణ ఉద్యమకారులు, రిటైర్ట్ ఉద్యోగులు, సీనియర్ నాయకులను బీజేపీలో చేర్చుకుంటున్నారు. ఇందులో భాగంగానే.. తాజాగా.. తెలంగాణ లో ప్రముఖ వ్యాపార వేత్త, టీవీ 9 అధినేత మై హోం రామేశ్వరరావు ను కూడా… బీజేపీ బుట్టలో వేసినట్లు సమాచారం అందుతోంది.
ఇటీవలే సమతా మూర్తి విగ్రహా ఆవిష్కరణ సమయంలో.. ఈ మేరకు మై హోం రామేశ్వరరావుతో బీజేపీ అధిష్టానం చర్చలు జరిపినట్లు సమాచారం అందుతోంది. అంతేకాదు… మై హోం రామేశ్వరరావుకు రాజ్య సభ సీటు కూడా ఇచ్చేందుకు బీజేపీ పార్టీ సిద్ధమైనట్లు తెలుస్తోంది.
దీనికి మై హోం రామేశ్వరరావు కూడా అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. అందుకే సీఎం కేసీఆర్ సమతా మూర్తి విగ్రహం వద్దకు వెళ్లలేదని తెలుస్తోంది. మై హోం రామేశ్వరరావు.. పార్టీలో చేర్చుకుంటే…. ఎన్నికల ఫండ్ సులభం అవడంతో పాటు.. మీడియా కూడా తమ గుప్పట్లోకి వస్తుందని బీజేపీ పన్నాగం వేసింది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.