సీఎం కేసీఆర్ కు ఊహించని షాక్ తగిలింది. భారత రాష్ట్ర సమితిని ఎన్నికల ముందు మైనంపల్లి హనుమంతరావు వీడనున్నారు. త్వరలోనే బిజెపి కండువా కప్పుకోనున్నారు మైనంపల్లి హనుమంతరావు. ఇప్పటికే మైనంపల్లి ఇంటి వద్ద భారత రాష్ట్ర సమితి పార్టీ ఫ్లెక్సీలను తొలగించారు మైనంపల్లి హనుమంతరావు అనుచరులు.
ఇక తాజాగా మైనంపల్లి హనుమంతరావు వికీపీడియా పేజీలో కూడా ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో ఉన్నట్లు… అప్డేట్ చేశారు. దీంతో మైనంపల్లి హనుమంతరావు బిజెపి పార్టీలో చేరబోతున్నట్లు స్పష్టంగా అందరికీ క్లారిటీ వచ్చేసింది. కాగా, తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. ఇటీవలే తన ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీ.. ఇప్పుడు అందులో స్వల్ప మార్పులు చేసే దిశగా యోచిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా మల్కాజిగిరి అసెంబ్లీ స్థానం అభ్యర్థిని మార్చే ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. ఈ స్థానానికి ఇప్పటికే ప్రకటించిన మైనంపల్లి హన్మంతరావు స్థానంలో మరొకరికి అవకాశం ఇవ్వాలని బీాఆర్ఎస్ అధిష్ఠానం నిర్ణయించినట్లు సమాచారం.
బీజేపీలోకి మైనంపల్లి!!
ఇప్పటికే మైనంపల్లి ఇంటి వద్ద బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీల తొలగింపు
తాజాగా మైనంపల్లి వికీపీడియా పేజీలో ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో ఉన్నట్లు అప్డేట్ pic.twitter.com/o7s4Vk4liU
— Telugu Scribe (@TeluguScribe) August 27, 2023