రూ. 210తో ప్రతీ నెలా రూ. 5 వేలు.. అలానే ఈ లాభాలు కూడా..!

-

మంచి స్కీమ్స్ లో డబ్బులని పెట్టుకోవాలని అనుకుంటున్నారా..? అయితే ఈ స్కీమ్ వివరాల ని మీరు కచ్చితంగా తెలుసుకోండి. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎన్నో స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. కేంద్రం తీసుకొచ్చిన స్కీమ్స్ లో అటల్ పెన్షన్ యోజన కూడా ఒకటి. ఈ స్కీమ్ వలన ఎన్నో లాభాలను పొందవచ్చు. 60 సంవత్సరాల తర్వాత నెలకు 5 వేల రూపాయల పెన్షన్ ని పొందవచ్చు. అటల్ పెన్షన్ యోజన లో పొదుపు చేసుకుంటే నెలకు రూ. 1000, రూ. 2000, రూ. 3000, రూ. 5 వేలు ఇలా పెన్షన్ ని పొందవచ్చు.

అయితే దీనిలో మీరు ఇన్వెస్ట్ చేసే దాన్ని బట్టీ మీకు డబ్బులు వస్తాయి. వయసును బట్టి నెలనెలా ఇందులో ఇన్వెస్ట్ చేసారంటే 60 సంవత్సరాల తర్వాత మీకు పెన్షన్ వస్తుంది. ఈ స్కీమ్ లో 18 సంవత్సరాల నుంచి 40 ఏళ్ల వయసులో వున్నవాళ్లు ఎవరైనా సరే ఈ పథకం లో డబ్బులని పెట్టుకోవచ్చు. పోస్టాఫీస్‌లో లేదా బ్యాంక్‌లో ఈ స్కీమ్ ని ఓపెన్ చేసుకో వచ్చు. ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. గవర్నమెంట్ పథకం కనుక గ్యారంటీ రిటర్న్స్ వస్తాయి. దీంట్లో వయసును బట్టి ఇన్వెస్ట్‌మెంట్ ఆధారపడి ఉంటుంది.

18 సంవత్సరాల వయసులో ఈ స్కీమ్ లో చేరినట్టయితే, నెలకు రూ.210 పే చేసుకోవాలి. ఇలా చేసిన వారికి 60 ఏళ్ల తర్వాత నెలకు రూ. 5 వేల పెన్షన్ వచ్చేస్తుంది. అదే 25 సంవత్సరాల వయసులో చేరితే నెలకు రూ.226 ని కట్టాలి. అప్పుడు మీకు 60 ఏళ్ల తర్వాత నెలకు రూ. 3 వేల పెన్షన్ పొందొచ్చు. 39 సంవత్సరాలకు ఈ పథకంలో చేరేవారు నెలకు రూ. 3 వేల పెన్షన్ కోసం రూ. 792 జమ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ వ్యక్తి చనిపోతే నామినీకి ఆ ప్రయోజనం ఉంటుంది. నామినీ అకౌంట్‌లో రూ. 5.1 లక్షలు పడతాయి. ఇలా జీవిత కాలం నెలనెలా పెన్షన్ వస్తుంది. ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news