సీఎం రేవంత్ రెడ్డితో నాబార్డ్ చైర్మన్ షాజీ కేవీ భేటీ..

-

సీఎం రేవంత్ రెడ్డితో నాబార్డ్ చైర్మన్ షాజీ కేవీ సమావేశం అయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం నాబార్డ్ చైర్మన్‌ను కలిసిన సీఎం రేవంత్.. ‘RIDF కింద తక్కువ వడ్డీకి రుణాలు, మైక్రో ఇరిగేషన్‌కు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కో-ఆపరేటివ్ సొసైటీలను బలోపేతం చేయాలని, కొత్తగా మరిన్ని కో-ఆపరేటివ్ సొసైటీలను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కోరారు.

స్వయం సహాయక సంఘాల మహిళా గ్రూపులకు ప్రత్యేక పథకాన్ని రూపొందించాలని విన్నవించారు. ఐకేపీ, గోడౌన్స్, రైస్ మిల్లులను నాబార్డుకు అనుసంధానం చేసి రాష్ట్రంలో మిల్లింగ్ కెపాసిటీ పెంచేందుకు సహకరించాలన్నారు.కాగా, కొత్త జిల్లాల్లో డీసీసీబీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నాబార్డ్ చైర్మన్ ప్రతిపాదించినట్లు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news