బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. బీజేపీలోకి నాగర్ కర్నూల్ ఎంపీ !

-

BRS MP Pothuganti Ramulu : గులాబీ బాస్‌ కేసీఆర్‌ కు షాక్‌ తగలనుంది. BJP గూటికి బీఆర్‌ఎస్‌ పార్టీ సిట్టింగ్‌ ఎంపీ వెళ్లనున్నారని సమాచారం. నాగర్ కర్నూలు బీఆర్‌ఎస్‌ పార్టీ ఎంపీ పోతుగంటి రాములు పార్టీ మారబోతున్నారట. బీఆర్‌ఎస్‌ పార్టీ ఎంపీ పోతుగంటి రాములు….బీజేపీ పార్టీలో చేరనున్నట్లు సమాచారం అందుతోంది.

Nagar Kurnool MP ramulu joins BJP

బీఆర్‌ఎస్‌ పార్టీ ఎంపీ పోతుగంటి రాములు, గువ్వల బాలరాజు మధ్య విభేధాలు ఉన్నాయని సమాచారం. వచ్చే ఎన్నికల్లో ఎంపీ టికెట్‌ గువ్వలకు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో మొన్న కేటిఆర్ పాల్గొన్న బిఆర్ఎస్ సమావేశాలకు డుమ్మా కొట్టిన బీఆర్‌ఎస్‌ పార్టీ ఎంపీ పోతుగంటి రాములు…బీజేపీ పార్టీ టచ్‌ లోకి వెళ్లారట.

ఇక రెండు, మూడు రోజుల్లో తన అనుచరవర్గంతో భేటి అయి నిర్ణయాన్ని ప్రకటించనున్నారట రాములు. తన కుమారుడు భరత్ ప్రసాద్ కు ఎంపి టికెట్ విషయంలో బీజేపీ హమీ ఇచ్చినట్లు సమాచారం. అందుకే బీజేపీలో చేరేందుకు సిద్ధం అయ్యారట బీఆర్‌ఎస్‌ పార్టీ ఎంపీ పోతుగంటి రాములు.

Read more RELATED
Recommended to you

Latest news