నల్లగొండ ముషంపల్లి బోర్ల రాంరెడ్డి కష్టాలు మళ్లీ షురూ..!

-

గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో వర్షాలు లేక ప్రజలు నరకయాతన అనుభవించారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే వర్షాలు లేక రైతులు నానా ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు.  ఎక్కడ చూసినా అవస్థలు, కష్టాలు, ఇబ్బందులే. కాంగ్రెస్‌ సర్కార్‌ పాలనలో తెలంగాణ రాష్ట్ర రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. గత సమైఖ్య పాలన లో తెలంగాణ రాష్ట్ర రైతులు ఎన్ని కష్టాలు పడ్డారో.. ఇప్పుడు కూడా రైతన్నలు అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చినప్పటీ నుంచి రైతులే కాదు.. సామాన్య ప్రజలు కూడా ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు.  కాంగ్రెస్‌ పాలనలో నల్లగొండ ముషంపల్లి బోర్ల రాంరెడ్డి కష్టాలు మళ్లీ షురూ అయ్యాయి. ఆనాడు ఉమ్మడి ఆంధ్ర పాలనలో నీళ్ళ కోసం 100కి పైగా  బోర్లు వేసిన రైతుగా బోర్ల రాంరెడ్డి చాలా ఫేమస్ అయ్యాడు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత నీళ్ళ కష్టాలు లేవు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత నీటి ఎద్దడితో ముషంపల్లిలో బోర్ల రాంరెడ్డి ఒకడే 6 బోర్లు వేయగా నల్లగొండ జిల్లాలో రైతులు లక్షలాది రూపాయలు ఖర్చు చేసి వందల బోర్లు వేస్తున్నారు. దీంతో నల్లగొండ ముషంపల్లి బోర్ల రాంరెడ్డి కష్టాలు మళ్లీ షురూ అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news