సచివాలయంలో ప్రార్థనామందిరాల ప్రారంభోత్సవంలో సీఎం, గవర్నర్

-

తెలంగాణ నూతన సచివాలయంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తొలిసారిగా అడుగుపెట్టారు. సచివాలయ ప్రాంగణంలో నిర్మించిన నల్లపోచమ్మ అమ్మవారి ఆలయంతో పాటు మసీదులు చర్చ్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్​తో కలిసి గవర్నర్ ప్రారంభించారు.  సచివాలయానికి నైరుతిలో నల్ల పోచమ్మ అమ్మవారితో పాటు శివాలయం, అంజనేయ స్వామి ఆలయాలను నిర్మించారు. ప్రారంభ వేడుకల్లో భాగంగా ధ్వజస్తంభ ప్రతిష్టాపన, విగ్రహాలకు ప్రాణప్రతిష్ట జరుగుతోంది. ఉదయం నుంచి చండీయాగం, దిగ్బలి, ప్రాణ ప్రతిష్ట హోమం, ధ్వజస్థంభ ప్రతిష్టాపన చేపట్టగా… అనంతరం, యంత్ర ప్రతిష్టాపన… విగ్రహాల ప్రతిష్ట, శిఖర కుంభాభిషేకం, నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్వహించిన మహా పూర్ణాహుతి, మహా మంగళ హారతి కార్యక్రమాల్లో గవర్నర్‌ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొన్నారు. మంత్రులు హరీశ్‌ రావు, వేముల ప్రశాంత్‌ రెడ్డి, పువ్వాడ అజయ్‌, కొప్పుల ఈశ్వర్‌, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీఎస్​ శాంతికుమారి అమ్మవారికి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

అనంతరం చర్చి, మసీదులను గవర్నర్, సీఎం కలిసి ప్రారంభించారు. మూడు మతాల వారికి ప్రాధాన్యం దక్కాలనే ఉద్దేశంతోనే సచివాలయ ప్రాంగణంలో నల్లపోచమ్మ ఆలయం, చర్చి, మసీదు నిర్మించామని సీఎం కేసీఆర్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news