BREAKING : నందమూరి తారకరత్నకు అరుదైన వ్యాధి !

-

గుండెపోటుకు గురైన తారకరత్న అత్యంత అరుదైన మేలేనా వ్యాధితోను బాధపడుతున్నట్లు బెంగళూరు వైద్యులు గుర్తించారు. ఇది జీర్ణాశయంలోపల రక్తస్రావానికి సంబంధించినది. దీనివల్ల నోరు, అన్నవాహిక, పొట్ట భాగంలో బ్లీడింగ్ అవుతుంది.

శరీరంలో రక్త స్థాయిలు తగ్గిపోయి బలహీనంగా మారిపోతారు. క్రమంగా అనిమీయాకు దారితీస్తుంది. అలాగే శరీరం రంగు మారడం, గుండె వేగంగా కొట్టుకోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయని డాక్టర్లు తెలిపారు.అయితే, నారా లోకేష్‌ పాదయాత్రలో నిన్న ఓ అపశృతి చోటు చేసుకుంది. నందమూరి తారకరత్నకు పాదయాత్రలో గుండె పోటు వచ్చింది. దీంతో ఆయన ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news