అద్దంకి దయాకర్ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోవడం పై జాతీయ మాలమహానాడు ఆందోళన

-

అద్దంకి దయాకర్ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోవడం పై జాతీయ మాలమహానాడు ఆందోళన చేపట్టింది. తాజాగా ట్యాంక్ బండ్ అంబెద్కర్  విగ్రహం వద్ద నిరసన చేశారు. ఈ సందర్భంగా జాతీయ మాలమహానాడు తెలంగాణ అధ్యక్షుడు పిల్లి సుధాకర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అద్దంకి దయాకర్ కు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి.

పదేపదే అద్దంకిని అవమానించడం సమంజసం కాదు అన్నారు. తెలంగాణ ఉద్యమకారునికి కాంగ్రెస్ అవమాన పరుస్తుంది. అద్దంకి రాజకీయ ఎదుగుదలను అడ్డుకునే శక్తులను బయటపెట్టాలి. ఎమ్మెల్సీ నామినేషన్ వేయమని చెప్పి చివరి నిమిషంలో పేరు మార్చడం అద్దంకిని అవమానించడమే అన్నారు. రాహుల్ గాంధీ,  సోనియా గాంధీ లు తెలంగాణ రాష్ట్ర రాజకీయ పరిణామాలపై దృష్టి పెట్టాలి. అద్దంకి దయాకర్ ని అడ్డుకునే శక్తులను నిర్వీర్యం చేయడానికి తెలంగాణ పౌర సమాజం ఏకం కావాలి. అద్దంకి కి సముచిత స్థానం కల్పించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మాల మహానాడు ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తాం అని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news