ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అవకాశం దక్కించుకున్న కాంగ్రెస్ నేతలు మహేశ్ కుమార్, బల్మూరి వెంకట్లు ఎమ్మెల్యే కోటాలోని రెండు శాసన మండలి స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్కరమార్కతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి పాల్గొన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసిన వారికే గుర్తింపు దక్కుతుందనడానికి ఉదాహరణే మహేశ్‌గౌడ్, బల్మూరి వెంకట్‌కు ఎమ్మెల్సీ అవకాశమని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. మొదటి నుంచి పార్టీ సంక్షేమం, అభివృద్ధి కోసం పని చేస్తున్న వారికి భవిష్యత్లో అవకాశాలు ఉంటాయని ఎవరూ నిరాశ చెందవద్దని తెలిపారు.
మరోవైపు ఎమ్మెల్సీఎన్నికలకు ఈ నెల 11వ తేదీన నోటిఫికేషన్ జారీకాగా అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఈరోజు వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. ఈ నెల 19న నామపత్రాల పరిశీలన, 22వ తేదీ వరకు ఉపసంహరణ ప్రక్రియ జరుగుతుంది. ఈ నెల 29న ఎన్నికలు జరగనుండగాఆ సాయంత్రమే ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడి వెనువెంటనే జరుగుతాయని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. నామినేషన్ల గడువు ఇవాళ్టితో ముగియనుంది.